మార్చి 10 కవిత అరెస్టు ఖాయం.. కేఏ పాల్ జోస్యం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా… కేసీఆర్ కుమార్తె కవిత మరో 48 గంటల్లో అరెస్టు కాబోతున్నారన్నారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కవితను మార్చి పదో తారీఖున అరెస్టు చేస్తారన్నారు. కేసీఆర్ పతనానికి ఇది ఆరంభం మాత్రమేనన్నారు. తెలంగాణలో ఉన్న బిడ్డలు, రైతుల కన్నీళ్లు, నిరుద్యోగుల కన్నీళ్లు, అమరవీరుల కుటుంబాల కన్నీళ్లు, అనేక మంది వీరుల కన్నీళ్లు, ఉసురు కేసీఆర్ కుటుంబానికి తగిలిందన్నారు కేఏ పాల్. కేసీఆర్ దేవుడ్నే శత్రువుగా చేసుకున్నారన్నారు.