Breaking NewscrimeHome Page SliderTelangana

ములుగు జిల్లాలో మావోల ఘాతుకం

పోలీస్ ఇన్ఫార్మ‌ర్లు అనే నెపంతో ఇద్ద‌రు సామాన్యుల‌ను మావోలు దారుణంగా న‌రికి చంపిన ఘ‌ట‌న గురువారం అర్ధ‌రాత్రి తెలిసింది. ములుగు జిల్లా వాజేడు మండ‌లం పేరూరు పంచాయితీ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న అర్జున్‌,పెనుగోలు కాల‌నీకి చెందిన ర‌మేష్ అనే వ్య‌క్తుల‌ను మావోయిస్టులు అతి కిరాత‌కంగా న‌రికి చంపారు. గతంలో ర‌మేష్‌ని ఇదే విష‌యంపై ప‌లుమార్లు హెచ్చ‌రించారు.అయినా ర‌మేష్ విన‌క‌పోక‌వ‌డంతోనే చంపిన‌ట్లు అనుమానిస్తున్నారు. మృత‌దేహాలు ర‌క్త‌పు మడుగులో ఉండ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు….వారి వారి కుటుంబీకుల‌కు,పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు.మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

BREAKING NEWS: అదానీ కేసుపై అమెరికా ప్రభుత్వం క్లారిటీ..