మనోజ్ కంప్లైంట్..మంచు విష్ణు అనుచరుడు అరెస్ట్..
శంషాబాద్ జల్‌పల్లిలో మోహన్ బాబు నివాసంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా మారాయి. దీనితో మంచు మనోజ్ కంప్లైంట్‌పై మంచు విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్‌పై దాడి జరిగిందనే ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. ఇద్దరు విష్ణు అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని మనోజ్ మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరో నిందితుడు వినయ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.

