మన్మోహన్ అస్తమయం
భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్ధిక సంస్కరణల రూపకర్త ,బహుముఖ ప్రజ్జాశీలి డా.మన్మోహన్ సింగ్ అస్తమించారు.ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.1922లో పాకిస్తాన్ లో జన్మించిన ఆయన దేశ విభజనానంతరం ముందు నుంచే భారత్‌లో స్థిర పడిపోయారు. కేంద్ర కేబినెట్‌లో ఎన్ని మంత్రిత్వ శాఖలున్నాయో వాటిల్లో 60 శాతం శాఖల మీద పట్టున్న ఏకైక భారతీయుడు డా.మన్మోహన్ సింగ్.అదేవిధంగా ఎన్ని శాఖలున్నాయో వాటిల్లో 25శాతం శాఖల్లో క్రియాశీలక బాధ్యతలు వహించిన ఏకైక దేశ ప్రధాన మంత్రి ఒక్క మన్మోహన్ సింగ్ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. విదేశీ వాణిజ్య వ్యవహారాల ఆర్ధిక సలహాదారునిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారునిగా, భారత రిజర్వు బ్యాంకు డైరెక్టర్,భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు డైరెక్టర్‌గా,ఆసియాభివృద్ధి బ్యాంకుకు భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరుగా,అణుశక్తి కమిషను, అంతరిక్ష కమిషన్ మెంబర్ గా,ప్లానింగ్ కమిషన్ సభ్యునిగా,కార్యదర్శి,భారత్-జపాన్ జాయింట్ స్టడీ కమిటీ భారత కమిటీ ఛైర్మన్‌గా,రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా వీటితో పాటు మరో 15 శాఖల క్రియాశీలక బాధ్యునిగా పనిచేసి పాలనా వ్యవహారాల్లో మన్మోహన్‌కి మించి విధులు నిర్వర్తించిన వారెవరూ లేరనుకునే విధంగా,చరిత్ర కూడా శెభాష్ అని కీర్తించేలా దేశం కోసం అంకిత భావంతో ,చిత్తశుద్దితో,పార్టీ పట్ల ,ప్రజల పట్ల కృతజ్క్షతతో పనిచేసిన వ్యక్తి,శక్తి డా.మన్మోహన్ సింగ్ మాత్రమే అని చెప్పాలి. ఆయన మరణం పట్ల దేశ,విదేశీ ప్రముఖలంగా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసి తమ తమ సంతాపాన్ని ప్రకటించారు.