మణిపూర్ అల్లర్ల ఎఫెక్ట్- సీఎం రాజీనామా
మణిపూర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులకు ఆయన బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు శుక్రవారం మణిపూర్ గవర్నర్ అనసూయ ఉకియ్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆయన రాజీనామా లేఖను సమర్పించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అధిష్ట్రానం సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లోని మైతేయ్, కుకీల తెగల మధ్య కొన్నేళ్లుగా సంఘర్షణలు జరుగుతున్నాయి. మే 3 వతేదీన ఈ గిరిజన తెగల మధ్య సంఘీభావ ర్యాలీ హింసాత్మకంగా మారింది. దాదాపు 50 రోజులకు పైగా అల్లర్లు కొనసాగుతున్నాయి. హింసాత్మక చర్యలు పెరిగిపోవడంతో కేంద్ర సైన్యం, ప్రత్యేక బలగాలు కూడా రంగంలోకి దిగి, పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇంటర్నెట్‌పై ఆంక్షలు కూడా విధించారు. దీనితో జూన్ 3న విచారణ కమిటీ వేసి, దర్యాప్తు జరిపారు. రాష్ట్రగవర్నర్, ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడివిడిగా సంప్రదింపులు జరిపారు. అయితే రాష్ట్రంలోని ఇలాంటి పరిస్థితులకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల బీరేన్ సింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనితో అధిష్టానానికి ఈ నిర్ణయానికి రాక తప్పనిస్థితి ఏర్పాడిందని తెలుస్తోంది.

