వినాయకుడే వచ్చాడంటూ భక్తుల పూజలు
కోరుట్ల మండలంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా ఇంట్లో అందరు గణపతిని ప్రతిష్ఠించడం సర్వసాధారణంగా జరిగే విషయమే . ఇదే తరహాలో రాజేందర్ , వనజ దంపతులు తమ ఇంటిలో కూడా వినయకుడిని ప్రతిష్ఠించారు. కానీ ఈ రోజు వారి ఇంటి ముందు ఓ పాదం దర్శనమిచ్చింది. దీనిని చూసిన కుటుంబ సభ్యులు అది వినాయకుడి పాదమని పూజలు చేయడం మెదలు పెట్టారు. పాదం చుట్టూ పూలతో అందంగా అలంకరించారు. అయితే ఈ ప్రత్యేక దృశ్యాన్ని చూసేందుకు చుట్టూ పక్క ప్రజలు క్యూ కట్టారు. వినాయక చవితి పూర్తి అవుతున్న సందర్భంగా తమ ఇంటికి వినాయకుడు విచ్చేశాడని ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.