NewsNews AlertTelangana

నడిరోడ్డుపై మంచు విష్ణు వింత పోజ్‌లు

మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. మంచు ఫ్యామిలీ మీద ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. మోహన్‌ బాబు ఫసక్ డైలాగ్‌ గాని, మంచు లక్ష్మీ నిలదీసిఫై, ఆర్ షుడ్ బి రోల్డ్  (R Should Be Rolled).. ఇలాంటి చాలా డైలాగ్స్ మీద ట్రోలింగ్స్, కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇది ఇలావుండగా తాజాగా మంచు విష్ణు నడిరోడ్డు మీద వెరైటీ పోజుతో ఫోటో దిగి తన ట్వీటర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేశారు. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా ఎడిటింగ్‌లు చేసి మీమ్స్, ట్రోల్స్‌తో వైరల్‌ చేస్తున్నారు. కొంతమంది కామెంట్స్‌, వింత ఇమోజీలను పెట్టి నవ్వుకుంటున్నారు.

ఇక వీటిని చూస్తే నవ్వాగదు. అందుకే మంచు ఫ్యామిలీపై ఎప్పుడూ ఏదో ఒక ట్రోలింగ్ ఉంటుంది. మంచు లక్ష్మీ ఆమె ఫ్యామిలీపై జరుగుతన్న ట్రోలింగ్స్‌ పై, సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై ట్రోల్స్, మీమ్స్‌తో హద్దులు దాటడంతో, మంచు ఫ్యామిలీ అలా చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని, పది లక్షల రూపాయల వరకు దావా వేస్తామని ఒక ప్రెస్‌ నోట్ రీలీజ్ చేశారు. దానిపై కూడా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌ జరిగింది. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమా డబ్బింగ్‌తో బిజీగా ఉన్నాడు. డబ్బింగ్ చివరి దశలో ఉందని, ఇదే తన డబ్బింగ్‌కి చివరి రోజు అని మంచు విష్ణు తెలిపారు. ఓవరాల్ గా జిన్నా సినిమాలో పాయల్, సన్నీలియోన్ ల కోసం మంచు విష్ణు తెగ వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.