మంచు మనోజ్ భేషరతుగా క్షమాపణలు..
ఇటీవల ‘భైరవం’ అనే చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఏపీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు మంచు మనోజ్. అయితే ఈ సందర్భంలో మనోజ్ తన ఫ్యామిలీ గొడవలు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. మంచు విష్ణు భారీ చిత్రం ‘కన్నప్ప’ను ఉద్దేశించి శివుడు తనను డైరక్టర్ రూపంలో ఆదుకున్నాడని, శివుడు శివయ్యా.. అని పిలిస్తే రాడని సెటైర్లు వేశారు. అయితే దీనిపై భేషరతుగా మంచు మనోజ్ కన్నప్ప మూవీ టీమ్‌కి క్షమాపణలు చేశారు. శివయ్యా.. అనే డైలాగ్‌పై కౌంటర్ వేయడం తప్పే అని ఒప్పుకున్నారు. ఈ భారీ చిత్రంలో చాలామంది నటించారని, అందరూ కష్టపడి పని చేస్తారని, నేను సినిమాను విమర్శించడం తప్పేనని, ఒక సినిమా వాడిగా నేను అలా అనకూడదని క్షమించమని కోరాడు. కన్నప్ప సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

