crimeHome Page SliderTelanganaviral

బైక్ కోసం బావిలో దూకి తల్లికి బ్లాక్ మెయిల్..

చిన్నపిల్లలు అదికావాలి..ఇది కావాలని మారాం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పెళ్లయిన వ్యక్తి కూడా తల్లిని బైక్ కొని ఇమ్మని, లేదంటే చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేసిన ఘటన సంగారెడ్డిలో సంచలనం రేపింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడ్గిలో సాల్మన్ అనే వ్యక్తి బైక్ కావాలని కొన్నాళ్లుగా  తల్లిని, భార్యను సతాయిస్తున్నాడు. తాజాగా మరోసారి తల్లితో గొడవపడుతూ గ్రామ శివార్లలోని వ్యవసాయ బావిలో దూకాడు. దీనితో వారు కంగారు పడి స్థానికులను తీసుకెళ్లారు. బావిలో దూకిన సల్మాన్ పైపును పట్టుకుని, వ్రేలాడుతూ బైక్ కొనివ్వాలంటూ డిమాండ్ చేశాడు. చివరకు వారు బైక్ కొనడానికి ఒప్పుకోవడంతో పైపు పట్టుకుని పైకి వచ్చాడు.