Home Page SliderTelangana

మణికొండ భారీ పేలుడులో గాయపడ్డ వ్యక్తి

హైదరాబాద్ మణికొండలో భారీ పేలుడు సంభవించింది. కాగా మణికొండలోని లాలమ్మ గార్డెన్స్ వద్ద చెత్త సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడ స్థానిక ప్రజలు భయంతో ఉలిక్కి పడి పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు  ఘటనాస్థలాన్ని పరిశీలించి  కెమికల్స్ డబ్బా పేలినట్టు గుర్తించారు. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే  ప్రమాదంలో ఒకరు గాయపడగా చికిత్స నిమిత్తం ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో టెర్రరిస్టులుగా అనుమానం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేలుడు కెమికల్ డబ్బా వల్ల జరిగిందని పోలీసులు నిర్దారించడంతో హైదరాబాద్ వాసులంతా హమ్మయ్యా అనుకున్నారు.