కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే
20 ఏళ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీయేతర కుటుంబ నుంచి ఓ వ్యక్తి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, కర్నాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల్లో శిశిథరూర్ నిలిచారు. ఐతే కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ వర్గం అంతా మల్లికార్జున ఖర్గేకు అండగా నిలిచింది. ఎన్నికల్లో మొత్తం 96 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.