హయత్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ – హయత్‌నగర్ కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో చుట్టు పక్కలకు వ్యాపించి 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. సిలిండర్లు పేలిపోతుండటంతో స్థానికులు భయాందోళనకి గురయ్యారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి వుంది.

