Breaking NewsNewsNews AlertTelangana

భవన నిర్మాణంలో భారీ ప్రమాదం స్లాబ్ కింద పడి కార్మికుల మరణం…..!

రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ పరిధి బండ్లగూడలో గుహ నిర్మాణం లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్లాబ్ కొడుతున్న సమయంలో, సెంట్రింగ్ ఒక్కసారిగా కుప్పకూలి, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో సెంట్రింగ్ కింద పదుల సంఖ్యలో కార్మికులు ఉండటంతో, తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాలతో సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, ఈ నిర్మాణం చేపడుతున్న సంస్థ జాగ్రత్తలు తీసుకోకుండానే పనులు ప్రారంభించిందని ఆరోపిస్తున్నారు. వారు, కార్మికుల ప్రాణాల్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై స్థానికులు, నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారు, ప్రభుత్వ, పోలీసు విభాగాలతో మాట్లాడి ఈ సంఘటనకు సంబంధించిన ప్రతి విషయం విచారణ చేసి, తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.