కాంగ్రెస్ నుండి బీజేపీకి జంప్ చేసిన మహేశ్వర రెడ్డి
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు నిర్మల్‌కు చెందిన ఏలేటి మహేశ్వర రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ ఇచ్చిన సందర్భంలో ఖర్గేను కలుస్తానంటూ ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీలో చేరడం సంచలనమయ్యింది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ చొరవతో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆయన వెంటే ఉన్నారు. తెలంగాణాలో బీజేపీ రోజురోజుకు బలం పుంజుకుంటోంది. కాంగ్రెస్‌కు చెందిన అన్ని పదవులకు మహేశ్వరరెడ్డి రాజీనామా చేశారు. తరుణ్ చుగ్ ఆయనకు కండువా కప్పి బీజేపీలో ఆహ్వానించారు. కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలువనున్నారు మహేశ్వర రెడ్డి.


 
							 
							