Home Page SliderInternational

మహేష్ బ్యాక్ ప్యాక్ అన్ని లక్షలా? వామ్మో ముక్కున వేలేసుకోవాల్సిందే?

స్టైల్ గా ట్రావెల్ చేసే విషయంలో మహేష్ బాబు, ప్రత్యేకంగా కన్పించేందుకు ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళుతున్నప్పుడు, సూపర్ స్టార్ విమానాశ్రయంలో విలాసవంతమైన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ బ్యాక్‌ప్యాక్‌ని తీసుకువెళ్తూ కన్పించాడు. సొగసైన నలుపు, నీలం డిజైన్, సిగ్నేచర్ LV మోనోగ్రామ్‌తో సూపర్ స్టార్ ఎయిర్ పోర్టులో కన్పించాడు. బ్యాక్ ధర ఎంతంటే సుమారుగా 4 లక్షలు. అవును, మీరు చదువతున్నది నిజమే.. ఆ బ్యాగ్ ధర అక్షరాల 3 లక్షల 92 వేల 656.

చాలామంది సాధారణ బ్యాక్‌ప్యాక్‌తో సంతృప్తి చెందుతారు. అయితే మహేష్, లూయిస్ విట్టన్ యాక్సెసరీ బ్యాక్ ప్యాక్ వినియోగిస్తారని తాజాగా తేలింది. ఈ బ్యాక్‌ప్యాక్ స్టైలిష్‌గా మాత్రమే కాకుండా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ బ్యాక్ ప్యాక్ ఎందుకు అంత ధర అంటే అందుకు టక్కున సమాధానం వస్తోంది. బ్యాక్ ప్యాక్‌ను అత్యధిక నాణ్యత పదార్థాలతో తయారు చేశారని, పలు విధాలుగా ఉపయోగించుకునేందుకు, డివిజన్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. డిజైనర్ ఫ్యాషన్‌లో ఇదో సంచలనం. డబ్బు మాత్రమే ముఖ్యం కాదనుకున్నవారికి మహేష్ బాబు ధరించిన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్‌ప్యాక్ విలువైన వస్తువుని చెప్పాల్సిందే.