బుల్లితెర డాన్స్ షో కు మహేశ్ బాబు కుమార్తె సితారతో కలిసి ఎంట్రీ
మహేశ్‌బాబు సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు. టెలివిజన్ షోలకు, ఫంక్షన్‌లకు చాలా అరుదుగా వస్తుంటారు. ఇప్పుడు ఆయన అభిమానులను ఖుషీ చేసే పని ఒకటి చేసారు మన సూపర్ స్టార్ మహేశ్. అదేంటంటే ZEE TELUGU ఛానెల్‌లో ప్రసారమయ్యే ఒక డాన్స్ షోకు తన ముద్దుల కూతురు సితారతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీనిలో సితార అదిరిపోయే డాన్స్ కూడా చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. దీనిపేరు డాన్స్ ఇండియా డాన్స్ అనే డాన్స్ షో. ఇలా బుల్లితెరపై మహేశ్ కుమార్తెతో కలిసి సందడి చేయడంతో ఫ్యాన్స్ చాలా సంబరపడుతున్నారు.
ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది.

