Home Page SliderTelangana

మహబూబ్‌నగర్: బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరఫున ప్రచారంలో ఈటల

మహబూబ్‌నగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.

హన్వాడలో రోడ్ షో నిర్వహించి మాట్లాడిన ఈటల.

మిథున్, జితేందర్ రెడ్డి తలలోంచి వచ్చినట్టు ఉన్నాడు. అద్భుతంగా మాట్లాడుతున్నాడు.

కేసీఆర్ నన్ను రాచిరంపాన పెట్టిననాడు.. మూడు నెలలపాటు హుజూరాబాద్‌లో ఉండి నన్ను జితేందర్ రెడ్డి అన్న గెలిపించారు.

మిథున్‌ని గెలిపిస్తే నా రుణం తీరుతుంది. బంగారు తెలంగాణ అని కేసీఆర్ మాటలు మాత్రమే చెప్పారు. కానీ మేము నిజం (చేతలు) చేసి చూపిస్తాం. బీజేపీ అధికారంలోకి వస్తేనే అప్పుల ఊబిలో కూరుకుపోయే తెలంగాణ బాగుపడుతుంది. మిథున్ మచ్చ లేని బిడ్డ, రియల్ ఎస్టేట్ లేదు.. గుండాయిజం ఉండదు.. బెదిరింపులు ఉండవు. మీకు సేవ చేస్తారు. మిథున్‌ని గెలిపిస్తే నన్ను కూడా గెలిపించినట్టే.