మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన
హైదరాబాద్, జూలై 19:: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 95 , పౌరసరఫరాల శాఖకు సంబంధించి 84 , విధ్యుత్ శాఖకు సంబంధించి 82, హౌజింగ్‌కు సంబంధించి 79 దరఖాస్తులు, పంచాయతి రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 47, ఇతర శాఖలకు సంబంధించి 158 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్‌కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

