ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నా.. మహాసేన రాజేష్
పి గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తనకు టికెట్ కేటాయించడం కొందరికి ఇష్టం లేదని, తనపై దుష్ప్రచారం చేశారని ఆయన వీడియో సందేశం ద్వారా వివరించారు. హత్యలు, అఘాయిత్యాలు చేసిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కుంది కానీ.. రాజేష్ మహాసేనకు మాత్రం అవకాశం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. నాడు అంబేద్కర్ అవమానాలు ఎదుర్కొన్నారని… ఆయనను స్కూళ్లలోకి రానివ్వలేదని… పుస్తకాల్లో చదవానని… తన జీవితంలో తిరిగి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైందన్నారు. తనపై దుష్ప్రచారం చేసినవారందరినీ గుర్తుపెట్టుకుంటానని ఆయన చెప్పారు. పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానన్నారు. టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన దగ్గర్నుంచి మహాసేన రాజేష్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొందరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గతంలో ఆయన మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి.. ఇలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇస్తుందా అంటూ విమర్శలు గుప్పించారు.