మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్పు
ఏపీలో స్కూలు పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు చేయనున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీనితో క్వాలిటీ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మెనూలో దీపావళి నుండి మార్పులు చేయనున్నారు. భోజనంలో వారానికి ఐదురోజుల పాటు ఇస్తున్న గుడ్డును 3 రోజుల పాటు వేపుడు, కూర రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. రాగి జావతో పాటు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను కూడా ఇవ్వాలని, అరటి పండును కూడా మెనూలో చేర్చాలని భావిస్తున్నారు.

