అమలాపురం ఆర్టీసీ బస్సుల్లో లక్కీ గిఫ్ట్
అమలాపురం: మనసర్కార్ :
పల్లెవెలుగు బస్సుల్లో టికెట్టు రేట్లు తక్కువే కాదు. ఈ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు బంపర్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు ఏపీఎస్‌ఆర్టీసీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణీకులకు స్పెషల్ గిఫ్టులు దొరకబోతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సురక్షితమని ప్రచారం చేస్తున్నారు ఆర్టీసీ. ఈ జిల్లాలో నాలుగు డిపోల నుండి అమలాపురం నుండి వెళ్లే అర్టీసీ బస్సుల్లో తమ టికెట్టుపై ఫోన్ నెంబరు, పేరు, తదితర వివరాలతో ఈ బస్సుల్లో ఏర్పాటు చేసిన గిఫ్టు బాక్స్‌లో వేయాలని, లక్కీ డిప్ ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని ఆర్టీసీ మేనేజరు తెలియజేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రయాణీకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచే ఉద్దేశ్యంతో ఇలాంటి స్కీములు ఏర్పాటు చేస్తున్నారు. ఈమధ్యనే మచలీపట్నంలో కూడా ఇలాంటి గిఫ్టులు ప్రవేశపెట్టునట్లు తెలియజేశారు.

