బంగళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం
విశాఖ: బంగళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అది తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావడం లేదు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఏర్పడే తుపానులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలలో తీరం దాటుతాయి. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు తుపాన్లు ఉత్తర దిశగా వెళ్లిపోయాయి. తమిళనాడు నుండి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


 
							 
							