ప్రేమ పాక్ మీద.. అభిమానం కోహ్లి మీద…!
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. దాయాది దేశమైన పాకిస్థాన్ లోనూ అతనికి వీరాభిమానులున్నారు. పాకిస్తాన్‌లోని ఓ బాలుడు విరాట్ కోహ్లిపై ఫిదా అయ్యాడు. ఆ బాలుడికి ‘ విరాట్ కోహ్లి అంటే తనకు అమితమైన అభిమానం’ అని అంటున్నాడు. కోహ్లి ఆటను చూస్తూ, అతనిలా ఆడాలని ప్రాక్టీస్ చేస్తున్నానని చెబుతున్నాడు. విరాట్ మంచిగా ఆడాలి, పాక్ విజయం సాధించాలి అని అనడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

