Breaking NewscrimeHome Page Slider

ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌

ప్రేమ విష‌యం చెప్ప‌లేక‌…పెద్ద‌లను ఎదిరించ‌లేక ఓ యువ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్ (18) కు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత (20) కు సోష‌ల్ మీడియాలో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అయితే అమ్మాయి కంటే అబ్బాయి రెండేళ్ల చిన్న‌వ‌య‌స్కుడు.దీంతో త‌మ ప్రేమ‌ను ఇంట్లో అంగీక‌రించ‌ర‌నే నెపంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ప్రేమ విషయం తమ ఇంట్లో ఒప్పుకోరని, క్షణికావేశంలో ఇద్దరు జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.రైల్వే పోలీసులు, సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.