Andhra PradeshHome Page Slider

ఏపీ స్కిల్ కేసులో లోకేష్ ముద్దాయి కాదు… అతడిని అరెస్టు చేయం…సీఐడీ

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేష్‌కు ఊరట లభించింది. అతడు ఈ కేసులో ముద్దాయిగా చేర్చలేదని అతడిని అరెస్టు చేయబోవడం లేదని సీఐడీ కోర్టుకు తెలియజేసింది. దీనితో లోకేష్‌పై స్కిల్ స్కాంను క్లోజ్ చేసింది హైకోర్టు. ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై జరిగిన వాదనలలో లోకేష్‌పై ఈ కేసులో ఎలాంటి ఆరోపణలు, కంప్లైంట్లు లేవని, అతడు ముద్దాయి కాదంటూ సీఐడీ తరపు న్యాయవాదులు తెలియజేశారు. దీనితో అరెస్టు భయం లేనందున ముందస్తు బెయిల్ అవసరం లేదంటూ కోర్టు కేసు క్లోజ్ చేసింది.