Andhra PradeshHome Page Slider

లోకేష్ వల్ల నంద్యాలకు ‘జబర్జస్త్ షో’ సందడి వచ్చింది.

లోకేష్ నంద్యాల పర్యటనపై మండిపడుతున్నారు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి. తనను ‘సండే ఎమ్మెల్యే’ అని సంభోదించడంతో నేరుగా విమర్శలకు దిగారు. లోకేష్ పాదయాత్రలు చూడడానికి జనం రాలేదని, నంద్యాలకు జబర్జస్త్ షో వచ్చిందనుకున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం వారి చీఫ్ ట్రిక్స్ తనకు తెలుసన్నారు. లోకేష్ పర్యటనతో కామెడీ షోలా అనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ లోకేష్ పేరు పలకడం లేదనే ఫ్రస్టేషన్‌లో లోకేష్ ఉన్నారన్నారు. తన వెనుకే కార్యకర్తలు, పార్టీలో ముఖ్యనేతలు కొట్టుకుంటుంటే ఆపలేని స్థితిలో లోకేష్ ఉన్నారన్నారు. భూమా అఖిలప్రియ, ఏపీ సుబ్బారెడ్డి వర్గాల వారు కొట్టుకుంటుంటే లోకేష్ జబర్జస్త్ షో చూస్తున్నట్లు చూసారని విమర్శలు చేశారు ఎమ్మెల్యే శిల్పారవి.