బ్రిటన్ మూడవ మహిళా ప్రధానిగా లిజ్‌ట్రస్ -రిషి వెనుకంజ
భారత్ ఆశలు అడియాసలయ్యాయి. ఊహించినట్లుగానే బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్ గెలుపొందారు. దాదాపు గత రెండు నెలలుగా ఉత్కంఠ రేపుతున్న బ్రిటన్ ప్రధాని ఎన్నికలలో లిజ్ ట్రస్, భారత సంతతికి చెందిన రిషిసునాక్‌ని 20,000 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. లిజ్‌ట్రస్ 3 వ మహిళా బ్రిటన్ మహిళా ప్రధానిగా నిలిచారు. ఆమె ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచుతానని ఎన్నికలలో బ్రిటన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆమె పోలింగ్ మొదలైనప్పటి నుండీ రిషి సునాక్‌పై ముందంజలోనే ఉన్నారు.