నోరూరించే స్వీట్ల పేర్లతో ‘లింక్డిన్ ఆఫీస్’ వైరల్
లింక్డిన్ ప్రధాన కార్యాలయం బెంగళూరుకు చెందిన ఓ వీడియో ఇప్పుడు నోరూరిస్తోంది. ఎందుకంటే అక్కడ గదుల పేర్లకు స్వీట్ల పేర్లు ఉండడమే. గులాబ్ జామూన్, కాజూ కత్లీ అంటూ పేర్లు పెట్టింది. అంతేకాదు, అక్కడ పని చేయాలనే ఉత్సాహం ఉప్పొంగడానికి ఉద్యోగుల కోసం సకల సౌకర్యాలు అమర్చింది. వారికి వేడి వేడి ఫుడ్ కూడా సర్వ్ చేస్తోంది. క్రికెట్ ఆడిస్తోంది. లింక్డిన్‌లో పనిచేసే ఒక ఉద్యోగి పని నిమిత్తం బెంగళూరు ప్రధాన కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ప్రత్యేక సౌకర్యాలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. ఇక్కడ కేఫ్ ఏరియా, ప్లే ఏరియా, జిమ్ వంటి సకల సౌకర్యాలున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డ్రీమ్ ఆఫీస్ వర్క స్పేస్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఉంటే రోజూ ఆఫీసుకు వెళ్లాలనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

