లైన్ ఇన్‌స్పెక్టర్ రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం..
భద్రాద్రి కొత్తగూడెంలో విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ లైన్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ రైడ్‌లో దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఓ ఇంటి యజమాని విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లైన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును సంప్రదించగా, రూ.26,000 లంచం ఇవ్వాలని లైన్ ఇన్‌స్పెక్టర్ డిమాండ్ చేశాడు. దిక్కుతోచని పరిస్థితిలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు వలవేసి నాగరాజు లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రమేష్ తెలిపారు.

