శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్యామ్‌లకు వరద నీరు పోటెత్తుతోంది. కాగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణనదికి భారీ సంఖ్యలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీని కారణంగా శ్రీశైలం డ్యామ్ నిండు కుండలా మారింది. ఏకంగా ప్రాజెక్టులోకి 3,60,802 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. భారీ మొతాదులో వస్తున్న నీటిని అధికారులు అంతే మొతాదులో దిగువకు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను ఎత్తి నీటిని కిందకు తరలిస్తున్నారు. అయితే దీని పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 884.90 అడుగుల వరకు నీరు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతుంది. కోస్తా ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొడుతోంది. ఈ క్రమంలోనే అనంతపురంలో కురుసిన వర్షం కారణంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి , ప్రజలు నానా అవస్ధలు పడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోనూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు జలశయాలను తలపిస్తున్నాయి.