ప్రణయ్ హంతకులకు జీవిత ఖైదు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి నల్లొండ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.ఇదే కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఉరిశిక్ష విధించింది.ఇప్పటికే ముగ్గురు నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.అమృత తండ్రి మారుతీ రావు 2018లో అప్పటి ఉగ్రవాది అస్గర్ అలీకి సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించాడు.గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండే హత్య కేసులో ఉన్న నిందితులతో కలిపి మొత్తం 7గురితో గ్యాంగ్ ఏర్పాటు చేసిన అస్గర్ అలీ…ఈ హత్యోదంతానికి ప్లాన్ చేశాడు.ఏ1 గా ఉన్న మారుతీరావు చనిపోగా ఏ2కి ఉరిశిక్ష ఖరారు చేశారు.ఏ3 అస్గర్ అలీ సహా నిందితులందరికినీ జీవిత ఖైదు విధించి కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలుకి తరలించారు.


 
							 
							