పొయ్యేటోణ్ణి పోనిద్దాం: రఘునందన్
తెలంగాణ బీజేపీ నుండి ఎంతమంది నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలు నిరాశపడకుండా పోరాడాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తల్లారా.. అధైర్యపడవద్దు. పొయ్యేటోణ్ణి పోనివ్వండి. వంద మంది కౌరవులను ఓడించిన పంచపాండవులను స్ఫూర్తిగా తీసుకుందాం. తెలంగాణ గడ్డమీద కాషాయ జెండా ఎగరవేసేదాకా అలుపెరుగని పోరాటం చేద్దాం అని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.