కృష్ణా జిల్లాలో చిరుత కలకలం
అడవి పందుల నివారణకు వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుని ప్రాణాలు విడిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి లో ఈ ఘటన జరిగింది.గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టగా అందులో చిరుత ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.రెవిన్యూ అధికారులు,సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే చిరుత చనిపోయిందని గ్రహించారు. ఈ ఘటనతో మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమోనని గ్రామస్తులు చుట్టూ ప్రక్కలు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

