పోలీస్ స్టేషన్ కు వెళ్లిన చిరుతపులి
అడవిలో ఉండే చిరుతపులి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లో దర్శనమిచ్చింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీస్ స్టేషన్లోకి చిరుతపులి వెళ్ళింది. స్టేషన్ మొత్తం తిరిగి ఎవరు లేకపోవడంతో తిరిగి చిరుత వెనక్కి వెళ్లిపోయింది. చిరుతపులిని చూసిన కానిస్టేబుల్ చిరుతపులి బయటకు వెళ్ళగానే తలుపులు మూసి వేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.