లెజెండరీ దర్శకుడు కన్నుమూత
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన తొలి తరం దర్శకులు శ్యామ్ బెనగళ్ (90) ఇకలేరు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఒక ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈయన హైదరాబాద్‌లో పుట్టిన శ్యామ్ బెనగళ్ జన్మతః కన్నడిగుడు. ఆయన తన సినిమాలలో శక్తివంతమైన స్త్రీ పాత్రలకు రూపకల్పన చేశారు. 1974లో ‘అంకుర్’ అనే చిత్రంతో మొదలు పెట్టి 2001లో ‘జుబేదా’ అనే చివరి చిత్రం వరకూ తన ప్రతీ చిత్రంలో స్త్రీలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చారు. ఎన్నో డాక్యుమెంటరీలు నిర్మించారు. జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ‘భారత్ ఏక్ ఖోజ్’ అనే పేరుతో తీసిన డాక్యుమెంటరీ దూరదర్శన్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను గెలుచుకున్నారు.

