కేసు వాదిస్తూ కుప్పకూలిన లాయర్..
తెలంగాణ హైకోర్టులో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం కేసు వాదిస్తూ ఒక సీనియర్ లాయర్ కుప్పకూలిపోయారు. వేణుగోపాల్ రావు అనే సీనియర్ లాయర్ ఒక కేసు విషయంలో వాదనలు వినిపిస్తూ ఉండగా, హఠాత్తుగా కూలబడిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. న్యాయవాది మృతికి సంతాపంగా నేడు హైకోర్టులోని అన్ని బెంచ్‌లలోనూ విచారణ నిలిపివేసి రేపటికి వాయిదాలు వేశారు.