Home Page SliderTelangana

“తెలంగాణాలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలి”:హరీశ్‌రావు

తెలంగాణా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలోని మైనార్టీలకు న్యాయం జరగడం లేదన్నారు. మరోవైపు ఏడాదిలోగా 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలోని నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు.కాగా నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో కేటాయింపులే జరగలేదన్నారు. అంతేకాకుండా తెలంగాణాలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.దీంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో మర్డర్‌లు,రేప్‌లు పెరిగాయని హరీశ్‌రావు వెల్లడించారు.