Home Page SliderNational

దివంగత ప్రధాని వాజపేయి మళ్లీ కళ్లముందుకు…

దివంగత ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజపేయిని మళ్లీ మన కళ్లముందుకు తీసుకురానుంది బాలీవుడ్. భారత దేశ ఆర్థికాభివృద్ధిలో ఆయన పాత్ర, దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే తపన తెలియజేస్తూ వాజపేయ్ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు మేకర్స్. భారత్‌లో విద్య, వైద్య,మౌలిక సదుపాయాలను అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. నటుడు పంకజ్ త్రిపాఠి, వాజపేయ్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి “మే అటల్ హున్” అనే పెట్టారు. మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్‌లో వాజపేయ్ లోక్‌సభకు ఎన్నికయినప్పడి నుండి ప్రధాని పదవిని చేపట్టిన విషయాలు, ఆయన దేశ,విదేశాలలో మాట్లాడిన మాటలు, ప్రతిపక్షనాయకునిగా వాదించిన తీరు ఒక గ్లింప్స్‌గా చూపించారు. ఈ చిత్రంలో ఆయన బాల్యం నుండి ప్రతీ విశేషాన్నీ తెరకెక్కించామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ బయోపిక్ మూడుమార్లు ప్రధాని పదవిని అలంకరించిన అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపబోతుందని తెలియజేశారు. ఒక కవి, ఉపన్యాసకుడు, రచయిత, ప్రధానిగా ఆయన జీవితాన్ని ఆద్యంతం ఈ చిత్రంలో ఉందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.