కుంభమేళా పోలీసులకు బంపర్ బొనాంజా
కుంభమేళ సందర్భంగా దాదాపు రెండు నెలల పాటు భక్తుల సేవలో తరించిపోయిన పోలీసులకు యోగి ప్రభుత్వం బంపర్ బంపర్ బొనాంజ ప్రకటించింది.కుంభమేళాను సక్సెస్ చేయడంతో పోలీసులు విధినిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించారని కొనియాడారు.కుంభమేళాలో డ్యూటీ చేసిన ప్రతీ పోలీసుకి ర్యాంకుతో పనిలేకుండా రూ.10వేలు నగదు , 7 రోజుల క్యాజువల్ లీవ్స్ ప్రకటించారు.వీటితో పాటు కుంభమేళా విజయోత్సవ సర్టిఫికెట్‌ని కూడా ప్రదానం చేశారు.దేశ సైనికుల కన్నా మిన్నగా పనిచేసి భారత్ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారని కొనియాడారు.దీంతో యూపి పోలీసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

