కులశేఖర్ ఇకలేరు
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ గేయ రచయిత కులశేఖర్ మృతిచెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసిన సినీప్రియులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ కు చెందిన కులశేఖర్ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం వంటి సినిమాలకు పాటలు రాసి ఆకట్టుకున్నారు.