కులాంతర వివాహం చేసుకున్నాడని…!
జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది.గుర్తు తెలియని దుండగులు…ఓ యువకుణ్ని అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారు. సూర్యాపేటలోని మామిళ్ళ గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడిని బండ రాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు.గత ఆరు నెలల కిందట కృష్ణ ఓ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు.ఆ నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.భార్యభర్తలిద్దరూ పెద్దలకు దూరంగా ఉంటున్నారు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసి కెనాల్ కట్టపై కృష్ణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకుని లభ్యమైన ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి ట్రాక్టర్‌లో తరలించారు.ఆసుపత్రి మృతుని భార్య,మృతుని అన్నదమ్ములు ఆర్తనాదాలు పెడుతూ భోరున విలపిస్తున్న తీరు కదిలించివేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

