అచ్చే దిన్ ఇదేనా..
అచ్చే దిన్ కోసం ఎదురుచూస్తున్న టైంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కరోజు లోనే హ్యాట్రిక్ కొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు, చమురు ధరలు కనిష్ఠానికి పడిపోయినా ఇంధనంపై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ వడ్డింపు, సెన్సెక్స్ రూ.19 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయని ఫైర్ అయ్యారు. అచ్చే దిన్ కు ఇవి సంకేతాలా లేక భారత్ ను గొప్పగా మార్చేందుకు ప్రారంభమా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

