పోలీసులపై కేటిఆర్ వైల్డ్ ఫైర్
ఏసిబి విచారణ అనంతరం బయటకు వచ్చిన మాజీ మంత్రి కేటిఆర్ … పోలీసులపై వైల్డ్ గా ఫైర్ అయ్యారు.ఏసిబి కార్యాలయం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కబోతుండగా అప్పటికే వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో కారు ఫుట్ స్టెప్ పై నిలబడి మీడియాకి ఆన్సర్స్ ఇచ్చారు.ఇంతలో ఓ పోలీసు అధికారి… మీడియాతో ఎలా మాట్లాడతారంటూ గట్టిగా అరిచారు.దీంతో కేటిఆర్‌కి చిర్రెత్తింది.మీడియాతో మాట్లాడితే పోలీసులకెందుకంత ఉలికిపాటు అంటూ ఆయన కూడా గదమాయించారు.తనను ఏసిబి అధికారులు….రేవంత్ ఇచ్చిన 4 ప్రశ్నలనే అటూ ఇటూ తిప్పి అడిగారని చెప్పారు.ఇది అసంబద్దమైన కేసని నేరుగా ఏసిబి అధికారులకే చెప్పానన్నారు.అనంతరం ఆయన కారు ఎక్కి వెళ్లిపోయారు.