క్యాన్సర్ బాలుడితో కేటిఆర్ సెల్పీ
ఆశావర్కర్లపై దాడి అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి పరిశీలన నిమిత్తం వచ్చిన మాజీ మంత్రి కేటిఆర్‌కి అనూహ్య సంఘటన ఎదురైంది.బాధితులకు భరోసానిచ్చి బయటకు వస్తుండగా ఓ బాలుడు కేటిఆర్‌కి ఎదురూ వచ్చి ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు.వెంటనే ఆ బాలుణ్ని టచ్ చేస్తూ కిందకు వంగి మాట్లాడబోతుండగా ఇతకి …క్యాన్సర్ అని ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. దీంతో బాలుణ్ణి దగ్గరకు తీసుకుని అతనికి సెల్ఫీ స్టిల్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నాడు.బాలుడు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించారు.మెరుగైన వైద్యం అందించాలని సూచించాడు.

