తగ్గేదేలే అంటున్న కేటిఆర్
తెలంగాణా మాజీ మంత్రి,బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్.. లగచర్ల ఘటన విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినా,మరికొంత మంది బీఆర్ ఎస్ నాయకులకు నోటీసులు పంపినా, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుగుతున్నా డోంట్ కేర్ అంటున్నారు.దాడి చేసిన రైతులకు బాసటగా నిలుస్తామంటున్నారు. అవి దాడులు కాదని, రైతుల అవేదన అంటూ సమర్ధింపు ట్వీట్‌లు చేస్తున్నారు.అంతే కాదు ..అసలు లగచర్ల లో జరిగింది దాడే కాదు …అదొక రైతు ఉద్యమం…అదొక రైతు పోరాటం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన నిందితుడు భోగమోని సురేష్, పట్నం నరేందర్ రెడ్డి చర్యలను కూడా కేటిఆర్ సమర్ధించేలా ట్వీట్ చేయడంతో …మా నాయకుడు తగ్గేదేలే అంటున్నాడంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు వేసుకుంటూ గర్వంగా ఫీల్ అవుతున్నారు.

