Home Page SliderTelangana

ఐటీ శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్

తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఐటీశాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. కాగా ఈ రోజు హైదరాబాద్ టీ-హబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకుపోతుందన్నారు. అయితే ప్రభుత్వం దీనికి ఎంతగానో కృషి చేసిందన్నారు. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణాకు కేంద్రం నుంచి ఎటువంటి సహాయం లభించపోయినా..అద్భుతమైన ప్రగతిని సాధించామని తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్‌ను ఐటీతో పాటు వాటి అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగామని కేటీఆర్ వెల్లడించారు.