కేటిఆర్ క్వాష్ కొట్టివేత
బీ.ఆర్.ఎస్.వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.ఫార్ములా ఈ రేసు కేసుని కొట్టి వేయాలని కోరుతూ కేటిఆర్ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు మంగళవారం వరకు తీర్పుని రిజర్వ్ చేసిన కోర్టు…ఈ రోజు తీర్పుని వెలువరించింది. ఏసిబి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు…కేటిఆర్ అడిగిన క్వాష్ చేయలేమని చెప్పింది. నో అరెస్ట్ ఉత్తర్వులు ఉన్నంత వరకు అరెస్ట్ చేయొద్దని కోరింది. నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటిఆర్ న్యాయవాదులు చేసిన విజ్క్షప్తిని డిస్మిస్ చేసి…నాట్ టు అరెస్ట్‌ని ఎత్తివేయాలని ఏసిబి చేసిన వాదనతో ఏకీభవించి కేసు కేసే అన్నట్లు తీర్పిచ్చింది.దీంతో కేటిఆర్ అరెస్ట్ ఇక లాంఛనం కానుంది.