కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట..
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 30 వరకూ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ తనపై కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వాదోపవాదనలు విన్న ధర్మాసనం ఈ నెలాఖరు వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని, పూర్తి దర్యాప్తు జరిగి, కేటీఆర్ పాత్ర ఏంటో తెలిసిన తర్వాతనే ఈ విషయంలో ముందుకు వెళ్లలని ఏసీబీ తరపు న్యాయవాదికి ఆదేశించింది. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు దర్యాప్తు కోసమేనని, ఈ కేసులో రూ.56 కోట్ల మేరకు చెల్లింపుల ఉల్లంఘన జరిగిందని, విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతులు తీసుకోలేదని రాష్ట్రప్రభుత్వం తరపు లాయర్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.


 
							 
							