కేటీఆర్ అన్నకు వెరైటీగా ‘బర్తడే విషెస్’
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నేడు పుట్టినరోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన అలిశెట్టి అరవింద్ సరికొత్త రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఐటీ మంత్రిగా హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేసిన కేటీఆర్ విజయాలను వివరిస్తూ, ఆయన హైదరాబాద్‌లో అభివృద్ధి పరచిన దుర్గం చెరువు వద్ద తీగల వంతెన, నగరంలోని పలు ఫ్లై ఓవర్లు, వివిధ దేశాల నుండి వచ్చిన పలు ఐటీ కంపెనీలు వివరాలను పొందుపరస్తూ ఒక బస్సుపై పోస్టర్‌ను ముద్రించారు. ఈ బస్సు 12 అడుగులు ఎత్తుతో 45 అడుగుల వెడల్పు కలిగి ఉంది. తమ నేత కేటీఆర్ ఇలాగే ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ అలిశెట్టి అరవింద్ భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ బస్సు 10 రోజుల పాటు ఈ పోస్టర్లతో హైదరాబాద్‌లో తిరగుతుందని ఆయన వెల్లడించారు. ఈ పోస్టర్లను చూసి, నగర వాసులు ఆశ్చర్యపోతున్నారు

