Home Page SliderNational

కేటీఆర్ ఢిల్లీ టూర్

ఢిల్లీ పర్యటనలో భాగంగ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. యూజీసీ నిబంధనల పై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి కేటీఆర్ వినతి పత్రం ఇచ్చారు. కొత్త నిబంధనల వల్ల మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. నిబంధనలు సవరించి తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్; మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు.